Sunday, January 19, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టుబడింది. నిందితుడు ఇంటర్నేషనల్ విమానంలో బంగారాన్ని తరలించి డొమెస్టిక్ ప్రయాణికునికి అప్పగించేందుకు ప్రయత్నించి డిఆర్‌ఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్నేషనల్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి చెన్నై వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడికి బంగారాన్ని అప్పగించాడు. ఇద్దరి కదలికలను పసిగట్టిన డిఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా బంగారం గుట్టు బట్టబయలైంది.

2031.35 గ్రాముల బంగారాన్ని పొడిగా తయారుచేసి దానిని క్యాప్సిల్ రూపంలో ఉండలుగా తయారుచేసి లోదిస్తుల్లో దాచుకుని తెచ్చి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డొమెస్టిక్ ప్రయాణికుడికి అప్పగించాడు. అయితే విషయాన్ని పసిగట్టిన డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు డొమెస్టిక్ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించగా బంగారం పట్టుబడింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డిఆర్‌ఐ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే పట్టుబడ్డ బంగారం విలువ 1.30,00,640 కోట్లు ఉంటుందని డిఆర్‌ఐ అధికారులు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News