7 వేల సీట్ల భర్తీకి కేంద్రానికి అనుమతి
న్యూఢిల్లీ : డెంటల్ సర్జరీ కోర్సులలో కటాఫ్ మార్కులకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు బ్రేకేసింది. కటాఫ్ మార్క్‌లను తగ్గించరాదనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2020 21 బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి కనీస అర్హత మార్క్‌లను కుదించరాదని కేంద్రం నిర్ణయించడం వివాదాస్పదం అయింది. ఈ నిర్ణయం అనుచితం, అక్రమం, చట్టవ్యతిరేకమని పేర్కొంటూ ఈ ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ విద్యాసంవత్సరపు డెంటల్ సర్జరీ డిగ్రీ కోర్సుల మొదటి సంవత్సరం ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుత సంవత్సరపు యుజి కోర్సుల నీట్‌లో పాల్గొన్న వారి మార్క్‌లను కనీసం పదిశాతం ప్రాతిపదికన తగ్గించి ఖాళీ సీట్లు కేటాయించాలని రూలింగ్ వెలువరించింది. గత ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన నీట్ పరీక్షలు జరిగాయి.
cut-off marks for dental surgery course