Wednesday, January 22, 2025

ఇద్దరు యువకుల గొంతు కోసిన దుండగులు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన నలుగురు వ్యక్తులు విత్తన పరిశ్రమల నుండి మంచి విత్తనాలు ఎంపిక చేసుకుని కొనుగోలు చేసి ఎగుమతి చేసుకునేవారు. వీరిలో పవన్ కుమార్, సంతోష్ కిష్టాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నలుగురి మధ్య చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో పవన్ కుమార్, సంతోష్‌ను కొందరు దుండగులు కత్తితో గొంతు కోశారు. స్థానికులు క్షతగాత్రులిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో సంతోష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News