Monday, December 23, 2024

క్యూట్ లవ్ స్టోరీ

- Advertisement -
- Advertisement -

లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్దన్ హీరోయిన్‌గా లంకా కరుణాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది.శివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినిమా టీజర్‌ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ “హైదరాబాద్ మహానగరం చిత్ర పరిశ్రమకు ఎంతో అనుకూలమైనది.

రాబోయే ఐదేళ్లలో ముంబయ్ తరహా చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌లో చూడవచ్చు. హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇక ఈ సినిమా చక్కటి ప్రేమకథతో తెరకెక్కింది”అని అన్నారు. హీరో ప్రతీక్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ “క్యూట్ లవ్ స్టోరీ ఇది. గీతాంజలి, ప్రేమించుకుందాంరా.. తరహాలో చక్కటి లవ్ స్టోరీగా రూపొందింది. ఫైట్స్, కామెడీ, రొమాన్స్ కూడా ఇందులో ఉంటాయి”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ వైష్ణవి, నిర్మాత లంకా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News