Friday, November 22, 2024

నియ్యత్ ఉంటే బర్కత్ ఉంటది: మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : నియ్యత్ ఉంటే బర్కత్ ఉంటదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.  రూ.97 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనుల పైలాన్‌ను మంత్రి హరీష్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బిజెపిది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని, మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు కర్ణాటకలో ఎక్కడ ఉన్నాయని అన్నారు. బిఆర్‌ఎస్‌ సర్కార్ చేసిన సాయాన్ని మీరంతా గుర్తుపెట్టుకోవాలి సూచించారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ ఉంది ఏం ఇచ్చింది ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టిందని ఎద్దేవా చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులను అర్దాంతరంగా తీసేసారని మండిపడ్డారు. అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో ఉన్న ఓడీఎఫ్‌ ఫ్యాక్టరీ భూముల్ని కేంద్రం అమ్ముతుందని తెలిపారు.

ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేది బీజేపీ అయితే ..ఉద్యోగాలు ఇచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీ అని పేర్కొన్నారు. పన్నులు పెంచేది బీజేపీ అయితే.. పనులు చేసేది బీఆర్‌ఎస్‌ పార్టీ పని అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు భారీగా పెరిగాయని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. 8.78లక్షల నీట్‌ ర్యాంకుకు రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీటు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లకు కటాఫ్‌ మార్కులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు. కొత్తగా 8 వైద్య కళాశాలలతో మరో 1,150 సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు మంత్రి వివరించారు. బి-కేటగిరీలో 85శాతం లోకల్ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచినట్లు మంత్రి వెల్లడించారు. వైద్య సీట్లలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరిందని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News