శేరిలింగంపల్లి: అటవీశాఖ అ నుమతులు తీసుకోకుండా చెట్లను నరికివేసినందుకు ఓ అధికారిపై వేటు పడింది. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. దారి వెంట ఉన్న చెట్లను నరికివేసి ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదం టూ జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న ఓ అధికారిని కూడా సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైటెక్ సిటీ నుండి కేపీహెచ్‌బి వెళ్లే మార్గంలో హైటెక్ సిటీ ఫ్లై్లై ఓవర్ నుండి యశోద ఆసుపత్రి వరకు ఉన్న సూమారు 73 చెట్లను గత నెలలో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పో లీసులు నరికివేశారు.
దీనిపై సామాజిక కార్యకర్త వినయ్ వండల రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాకేష్ మోహన్ దోబ్రియాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన దోబ్రియాల్ రం గారెడ్డి జిల్లా అటవీ అధికారి డి. సుధాకర్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చిల్కూర్,ఎఫ్‌డిఓ శంషాబాద్‌లను ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారు ఈ నెల 1వ తేదీన హైటెక్ సిటీ నుండి కూకట్‌పల్లి హౌ సింగ్ బోర్డ్ వరకు గుర్తించారు. నరికిన చెట్లను అశోక్‌లేలాండ్ మినీ ట్రాక్కులు నెంబర్ టిఎస్07యుసి 5162, టిఎస్09యుసి3558లలో తరలించినట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో ఉన్న డ్రైవర్లను ఆరా తీయగా వారు చెట్లను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నరికివుసినట్లు తెలిపారు. అక్రమంగా నరికిన దుంగలను జీహెచ్‌ఎంసీ వాహనంలో ఎ క్కించి అక్కడి నుంచి తరలించినట్లు వెల్లడించారు.
దీనిపై ఫా రెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాకేష్ మోహన్ దోబ్రియాల్‌కు అందజేశారు. అ లాగే ఈ నెల 8న కొత్తగూడాలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌తో కలిసి ఉన్నతాధికారులు మళ్లీ స్థలాన్ని పరిశీలించారు. చెట్ల నరికివేతపై జీహెచ్‌ఎంసీ ఫీల్డ్ అసిస్టెంట్లను విచారించి వారిని అరణ్య భవన్‌కు పిలిపించి జీహెచ్‌ఎంసీ యూబీడి, మియాపూర్ పరిధిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వాంగ్మూలాలను తీసుకున్నారు. వారి విచారణలో ఎఫ్ ఆర్ ఓ/ యూబీడీ, జీహెచ్‌ఎంసీ మేనేజర్ కె. చంద్రకాంత్‌రెడ్డి సమక్షంలోనే రహదారి వెంట ఉన్న చెట్ల నరికివేత జరిగినట్లు విర్దారించారు. ఫారెస్ట్ ఆఫీసర్‌గా చెట్లను రక్షించాలి, తన దృష్టికి వచ్చినప్పుడు చెట్ల నరికివేతను ఆపాలి, కానీ దురదృష్టవశాత్తు అతను తన ప్రాథమిక కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించి భారీ సంఖ్యలో చెట్ల నరికివేతలో పాల్గొన్నాడని అధికారులు తెలిపారు.
సామాజిక కార్యకర్త వినయ్ వంగల ఫిర్యాదును దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు విచారణలోనూ చెట్ల నరికివేతకు సంబంధించి ఫారెస్ట్ అధికారి చంద్రకాంత్‌రెడ్డి పాత్ర ఉందని నిర్దారణ జరగడంతో ఆయన సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.