- Advertisement -
హాక్‌ఐ ద్వారా పట్టుకున్న నగర పోలీసులు
హైదరాబాద్: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అందజేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హాక్‌ఐ మొబైల్ యాప్‌ను 2015లో ప్రారంభించారు. మొబైల్ ఫోన్స్ పోగోట్టుకున్న వారు ఇందులో సెల్ వివరాలు ఎంటర్ చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితులకు అప్పగిస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఐటి సెల్ మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి పట్టుకుంటున్నారు. హాక్‌ఐ ద్వారా ఇప్పటి వరకు నగర పోలీసులు 621 ఫోన్లును పట్టుకుని అందజేశారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా 80 మొబైల్ ఫోన్లను పట్టుకున్నారు. వాటి విలువ రూ.9,00000 ఉంటుంది. వాటిని నగర పోలీస్ కమిషనరేట్‌లో వారికి అందజేశారు. ఇప్పటి వరకు 17,03,988 మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 42,03,988మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.
- Advertisement -