Monday, December 23, 2024

సెంట్రల్ జోన్ డిసిపి ఆఫీస్‌ను ప్రారంభించిన సిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రినోవేషన్ చేసిన సెంట్రల్ జోన్ డిసిపి ఆఫీస్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బుధవారం ప్రారంభించారు. ఈ క్రమంలో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సెంట్రల్ జోన్‌ను 2002లో ఏర్పాటు చేశారు. ఆఫీస్‌ను అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎంవి కృష్ణారావు ప్రారంభించారు. అప్పుడు మొదటి డిసిపిగా ఇప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషర్ సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ హోదాలో సెంట్రల్ జోన్ డిసిపి ఆఫీస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్లు విక్రం సింగ్‌మాన్, ఎఆర్ శ్రీనివాస్, సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News