Monday, December 23, 2024

సైబర్ క్రైం పోలీసులకు అవార్డులు

- Advertisement -
- Advertisement -

CV Anand presented awards to Cyber ​​Crime Police

అందజేసిన నగర సిపి సివి ఆనంద్

హైదరాబాద్ : మహేష్ బ్యాంక్ కేసులో సైబర్ నేరస్థులను అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అవార్డులు అందజేశారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో 69మంది పోలీసులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నగర సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ.. మహేష్ బ్యాంక్ కేసులో పోలీసులు చాలా కష్టపడి సైబర్ నేరస్థులను పట్టుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాగే పని చేసి సైబర్ నేరస్థులను పట్టుకోవాలని, ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. రివార్డులు టెక్నికల్ నైపుణ్యం, స్పందన, వేగంగా స్పందించి దర్యాప్తు చేయడం తదితరాల ఆధారంగా అవార్డులకు ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో సిసిఎస్ జాయింట్ సిపి గజారావు భూపాల్, ఎసిపి కెవిఎం ప్రసాద్ , ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్సైలు, హెచ్‌సిలు, పిసిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News