Sunday, December 22, 2024

హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సీవీ ఆనంద్ సోమవారం బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండోసారి సీపీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉంది. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది.. పార్ట్ ఆఫ్ పోలీసింగ్. క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతాం. లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తాం. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం అనేది కీలకం. ప్రశాంతంగా వినాయక నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.

కాగా.. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదన‌పు డైరెక్టర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీసుగా ప‌దోన్నతిపై ఆయన కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లారు. అనంతరం 2021లో తిరిగొచ్చిన ఆయన 2021 డిసెంబ‌ర్ నుంచి 2023 అక్టోబ‌ర్ వ‌ర‌కూ హైద‌రాబాద్ సీపీగా ప‌ని చేశారు. ఆ తర్వాత డీజీపీ హోదా క‌ల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. 2023 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను సీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్యత‌లు అప్పగించింది. ప్రస్తుతం తిరిగి హైద‌రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News