‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, సివిఎల్ నరసింహారావు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్, విష్ణులు ‘మా’ సభ్యులతో సమావేశాలు జరుపుతున్నారు. అయితే వీరిద్దరూ నోటిఫికేషన్ వచ్చాకే తమ మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని తెలిపారు. అయితే మరో అధ్యక్ష అభ్యర్థి నరసింహారావు తన మ్యానిఫెస్టోను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాల గురించి మాట్లాడుతూ “ 2011లో ‘మా’ సభ్యుల సంక్షే మం కోసం కొన్ని రిజల్యూషన్స్ అనుకున్నాం. అప్పుడు మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే మ్యానిఫెస్టోను యధాతథంగా ఇప్పుడు అమలు చేయాలనుకుంటు న్నాం. ప్రత్యూష మరణించినప్పుడు జయసుధ ఛైర్‌పర్సన్‌గా ‘ఆసరా’ అనే ఆర్గనైజేషన్ ప్రారంభించాం. మీడియా లో ఉండే ఆడవారిపై అత్యాచారాలు, ఇతర ఇబ్బందులు ఎదురైతే అండగా ఉండాలి, ఆడపిలల్ల రక్షణ, ఆత్మ గౌరవం కాపాడటం కోసం ప్రారంభించిన ఈ ఆర్గనైజేషన్‌ను ఇప్పుడు యాక్టి వ్ చేయాలనుకుంటున్నాం. తెలంగాణకు చెందిన కొంతమంది నటులను మరచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు, పైడి జయరాజ్ వంటి నటులను మళ్లీ మళ్లీ గుర్తు చేయాలని కర్తవ్యంగా పెట్టుకున్నా”అని అన్నారు.
సివిఎల్ నరసింహారావు ‘మా’ మ్యానిఫెస్టో
- Advertisement -
- Advertisement -
- Advertisement -