Thursday, December 19, 2024

లోక్ సభలో  కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ !

- Advertisement -
- Advertisement -

తీర్మానించిన సిడబ్ల్యూసి

న్యూఢిల్లీ: లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) ఏక్రగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి. వేణుగోపాల్ వెల్లడించారు. నేడు ఏఐసిసి చీఫ్ ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం, ధరల పెరుగుదల, అగ్నివీర్, మహిళల సమస్యలు, రాజ్యాంగ రక్షణ వంటి అనేక అంశాలను లేవనెత్తింది. అయితే ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు లోక్ సభలో నిలదీయగల సరైన నాయకుడు రాహుల్ గాంధీయేనని సిడబ్య్లూసి భావించింది. ఇదిలావుండగా రాహుల్ గాంధీ వాయ్ నాడ్, రాయ్ బరేలి …రెండు చోట్ల గెలిచారు. అయితే దేనిని వదులుకుంటారనే దానిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఖర్గే వెల్లడించారు.

మోడీ ప్రమాణస్వీకారానికి ఇండియా కూటమి నేతలకు ఆహ్వానం అందలేదని, అందినప్పుడు హాజరయ్యే విషయం గురించి ఆలోచిస్తామని, ప్రస్తుతానికైతే అంతర్జాతీయ నేతలకే ఆహ్వానం అందిందని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News