న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి) చాలా సమతుల్యంగా ఉందని, యువత, అనుభవజ్ఞుల మేలుకలయిగా ఉందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ శుక్రవారం ప్రశంసించారు. రానున్న తెలంగాణ ఎన్నికల దృష్టా హైదరాబాద్‌లో జరగనున్న సిడబ్ల్యుసి సమావేశాలు ఎంతో కీలకమైనవని ఆయన తెలిపారు. గత నెలలో పునర్వవస్థీకరించిన సిడబ్ల్యుసిలో సచిన్ పైలట్, శశీ థరూర్ వంటి యువనాయకులు చోటు దక్కించుకున్నారు.
పార్టీ నాయకత్వం అప్పగించిన ఏ బాధ్యతనైనా అత్యంత నిజాయితీతో, నిబద్ధతతో నిర్వర్తిస్తానని, అయితే తన మనసు మాత్రం రాజస్థాన్‌లోనే ఉంటుందని, అక్కడే తనకు అత్యంత తృప్తి లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
అత్యంత పెద్ద పార్టీ అయిన కారణంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందని పైలట్ చెప్పారు. అయితే కూటమిలో ప్రతి పార్టీకి సముచిత గౌరవం లభిస్తుందని ఆయన అన్నారు.ఎవరు ఏ పాత్ర, బాధ్యత చేపగతారన్నది సమస్య కాదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవచ్చని ఆయన తెలిపారు.