Thursday, April 17, 2025

నవంబర్ 29న సిడబ్ల్యూసి సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) సమావేశం ఈ నెల 29న జరగనున్నది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరును ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న దృష్టా అదానీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలన్న అంశాన్ని కూడా సిడబ్లుసి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే సిడబ్లుసి సమావేశంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు కూడా పాల్గొననున్నారు.

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయాన్ని కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడంతోపాటు వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ సన్నద్ధతను గురించి కూడా కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ చర్చించనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News