Monday, December 23, 2024

సిడబ్ల్యుసి సభ్యులను ఖర్గే నామినేట్ చేస్తారు: స్టీరింగ్ కమిటీ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

రాయపూర్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి )కి ఎన్నికలు నిర్వహించకూడదని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. సిడబ్లుసి సభ్యులను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నామినేట్ చేయాలని శుక్రవారం రాయపూర్‌లో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేష్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సిడబ్లుసిలో దళితులు, గిరిజనులు, మహిళలు, యువజనులు, ఓబిసిలు, మైనారిటీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించేందుకు వీలుగా పార్టీ నిబంధనావళిని సవరించాలని కూడా స్టీరింగ్ కమిటీ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News