Monday, December 23, 2024

19న సిడబ్లుసి కీలక సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈనెల 19న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మేనిఫెస్టోకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు ఇదే చివరి సిడబ్లుసి సమావేశం కానుంది. ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెల్పడమే ఈ సమావేశం ప్రధాన ఎజెండా కానుంది.

ఇప్పటికే కాంగ్రెస్ అనేక హామీలను గుప్పించింది. పేద మహిళలకు లక్ష రూపాయలు ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం, ప్రస్తుతం రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయడం, 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం వంటివి ఇందులో ఉన్నాయి. కాగా, ఈనెల 19 న జరిగే సిడబ్లుసి సమావేశంలో దేశం లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చిస్తారు. వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల షేరింగ్‌పై కుదిరిన ఒప్పందాలకు ఆమోద ముద్ర వేస్తారు. గత సిడబ్లుసి సమావేశం డిసెంబర్ 21న జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News