Sunday, November 17, 2024

సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు అత్యవసరం

- Advertisement -
- Advertisement -

Cyber ​​security jobs are essential:Sandeep Maktala

శిక్షణ పొందేందుకు ఇదే సరైన సమయం
సైబర్ సెక్యూరిటీ రంగంలో దక్కే
అవకాశాలను సొంతం చేసుకోవాలి
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచప్రఖ్యాత అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్‌తో కలిసి నిర్వహిస్తున్న డిజిథాన్ సైబర్ సెక్యురిటీ ప్రోగ్రామ్ శిక్షణను ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభిస్తోంది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్‌లో భారత్ 10వ స్థానంలో నిలవడం, పెగాసస్ వంటి స్కైవేర్ ఇటీవల కలకలం సృష్టించిన తరుణంలో సైబర్ సెక్యూరిటీకి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో డిజిథాన్ సైబర్ సెక్యూరిటీ శిక్షణను జాబ్ ఓరియంటెడ్ రూపంలో అందజేస్తోంది. భద్రతాపరమైన సమస్యలను ఎదుర్కొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ (యూటిడి)తో కలిసి సైబర్ సెక్యూరిటీ ప్రొగ్రాం పేరుతో నెల రోజుల శిక్షణను టీటా డిజిథాన్ అందుబాటులోకి తెచ్చింది.

సెక్యూరిటీ స్పెషలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ అనలిస్ట్ ఉద్యోగాలు

ఈ శిక్షణ కార్యక్రమం గురించి టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వివరిస్తూ, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు అత్యవసరమైనవిగా మారాయని ఆయన వెల్లడించారు. ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటున్న విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నత అవకాశాలు కైవసం చేసుకునేందుకు శిక్షణ పొందేందుకు ఇది సరైన సమయమని ఆయన తెలిపారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో దక్కే అవకాశాలను సొంతం చేసుకోవాలని ఆయన సూచించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న అవకాశాల్లో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ ఐటి ఆడిటర్, పెనేట్రేషన్ టీజర్, సెక్యూరిటీ స్పెషలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ అనలిస్ట్, థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, అప్లికేషన్ సెక్యూరిటీ అనలిస్ట్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఆర్ హ్యాండ్లర్, థ్రెట్ హంటర్ ఉద్యోగాలు ఉన్నాయని ఆయన వివరించారు.

సైబర్ సెక్యూరిటీ రంగంలో సమగ్రమైన పట్టున్న నిపుణులతో శిక్షణ

సైబర్ సెక్యూరిటీ రంగంలో సమగ్రమైన పట్టున్న నిపుణులు ఈ సైబర్ రెడీ శిక్షణను పర్యవేక్షించనున్నారు. ఈ శిక్షణలో లైవ్ ప్రాజెక్టు సైతం ఉండనున్నట్టు ఆయన తెలిపారు. ఈ శిక్షణను దీర్ఘకాలిక ప్రోగ్రాంగా అందించనున్నట్టు ఆయన తెలిపారు. డిజిథాన్ సైబర్ రెడీ ప్రోగ్రాం పట్ల ఆసక్తి ఉన్న వారు bit.ly/digithon_academy ద్వారా నమోదు చేసుకోవాలని, మరింత సమాచారం కోసం 8712360354/ 6300368705/ 8123123434 నెంబర్ సంప్రదించాలన్నారు. శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఆగస్టు 13 తేదీ కాగా, 16వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కానున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News