Monday, October 21, 2024

సైబర్ నేరాలు పోలీస్ వ్యవస్థకు సవాలుగా మారాయి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజలు సురక్షితంగా ఉన్నరంటే పోలీసులే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి కల్పించాలంటే శాంతి భద్రతలు కీలకంగా మారాయని, శాంతిభద్రతలు లేని రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టయని తెలియజేశారు. సిఎం రేవంత్‌కు డిజిపి జితేందర్ స్వాగతం పలికారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగిన పోలీసుల అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. పోలీసు అమరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పోలీసుల అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్రాన్ని కాపాడేందుకు ఎంతో మంది పోలీసులు అమరులయ్యారని గుర్తు చేశారు. పోలీస్ సంక్షేమానికి ఏటా 20 కోట్లు ఇస్తున్నామని, సమాజానికి సేవ చేసేందుకే పోలీసు శాఖలోకి ఉన్నత విద్యావంతులు వస్తున్నారని ఆయన ప్రశంసించారు. సైబర్ నేరాలు పోలీస్ వ్యవస్థకు సవాలుగా మారాయని, సైబర్ క్రైమ్స్ ట్రేస్‌లో తెలంగాణ పోలీసులు ముందున్నారని కొనియాడారు. సైబర్ క్రైమ్స్‌లో మన విధానాన్ని కేంద్రం మెచ్చుకుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎఐ టెక్నాలజీతోనే ట్రాఫిక్ ఉల్లంఘనలను కట్టడి చేయాలని, ప్రజలను రెచ్చగొట్టేందుకు ఆలయాలపై దాడులు చేస్తున్నారని, ముత్యాలమ్మ ఆలయ ఘటనపై కఠిన చర్యలు తీసుకున్నామని రేవంత్ తెలిపారు. శాంతిభద్రతలను ఎవ్వరూ చేతిల్లోకి తీసుకొవద్దని, క్రిమినల్స్ తో పోలీసులు కఠినంగా ఉండాలని, బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని ఆయన సూచించారు. పదేళ్లలో తెలంగాణలో మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని, గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం టిజి న్యాబ్ ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News