హైదరాబాద్: భాగ్యనగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అడిక్‌మెట్‌కు చెందిన శ్రీహరిని తనకు తెలియకుండా టెలిగ్రామ్ విఐపి గ్రూప్‌లో సైబర్ చీటర్స్ యాడ్ చేశారు. ట్రేడింగ్ టాస్క్‌లు ఇస్తూ అధిక లాభాలను చీటర్స్ ఆశ చూపారు. శ్రీహరి నుంచి విడతల వారీగా 28 లక్షల రూపాయలు మోసగాళ్లు ట్రాన్సఫర్ చేయించుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు శ్రీహరి ఫిర్యాదు చేశాడు.
సైబర్ నేరగాళ్లు కోడ్ భాషల్లో మెసేజ్‌లు పంపిస్తూ మోసాలకు పాల్పడేందుకు కొత్త రూట్‌ను ఎంచుకుంటున్నారు. ప్రధానంగా గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత వచ్చే ఫోన్ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. గతంలో గూగుల్ సెర్చ్ చేయగానే సైబర్ నేరగాళ్లు జోక్యం చేసుకొని బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డువివరాలు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయించి మోసాలకు పాల్పడేవారని, ప్రస్తుతం గూగుల్ సెర్చ్ చేస్తున్న వారికి ఫోన్ చేసి మీకు సురక్షితమైన కోడ్ లాంగ్వేజ్‌లో మెసేజ్ వస్తుంది.. ఆ మెసేజ్ క్లిక్ చేసి మీ వివరాలు వెల్లడిస్తే సరిపోతుంది.. అంటూ సూచిస్తారని, ఆయా వివరాలు నింపేలోపే మీ ఫోన్‌లో ఉండే ఫోన్- పే, జిపే ఇతర మనీ వాలెట్‌కు లింక్ ఉన్న ఖాతాల నుంచి నగదును ఖాళీ చేస్తున్నారని సైబర్ నిపుణులు వివరిస్తున్నారు.