బెంగళూరు: సైబర్ నేరగాళ్ల పేరు చెబితే ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా డబ్బులు పోతున్నాయో అర్థం కావడంలేదు. సైబర్ నేరగాళ్లకు మానవత్వం అనేది లేకపోవడంతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి బయట పడుతున్నారు. ఫొటో గుర్తింపు కార్డును పట్టుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ కేసులో నేరం రుజువైతే జైలు జీవితం గడపాల్సి వస్తుందని వృద్ధ దంపతులను బెదిరించారు.
సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ కు భయపడి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. డియాగో నజరత్ అనే వ్యక్తి రైల్వే లో జాబ్ చేసి పదవి విరమణ చేశాడు. ఖానాపూర్ తాలూకా బిడి గ్రామంలో డియాగ నజరత్ తన భార్య పావియాతో కలిసి ఉంటున్నాడు. సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడడంతో వారి ఏకౌంట్లకు 50 లక్షల వరకు బదిలీ చేశారు. ఇంకా నగదు పంపించాలని ఒత్తిడి చేయడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.