Sunday, December 22, 2024

రిటైర్డ్ ప్రిన్సిపాల్‌కు సైబర్ నేరగాళ్ల టోకరా

- Advertisement -
- Advertisement -

షేర్లలో పెట్టుబడుల పేరిట దగా
రూ. 8 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్ బంజరాహిల్సకు చెందిన ఇంజనీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ నుంచి ఏకంగా 8 కోట్ల రూపాయలను సైబర్ కేటుగాళ్లు కాజేశారు. ఈ మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదైంది. మిలానీ లయన్స్ ఎస్సైజి అని గ్రూప్ నిర్వాహకుల పేరిట బాధితుడికి సెల్‌ఫోన్‌కు జూలై మొదటి వారిలో ఒక లింకు వచ్చింది ఓపెన్ చేసి ఎస్‌ఐజి ట్రెండింగ్ అని వాట్సప్ గ్రూప్ లో చేరారు. తొలత షేర్ మార్కెట్ బ్లాక్ రేట్ ఐపిఒల గురించి నిర్వాహకులు కీలక సమాచారం అందించారు.

20 రోజుల తర్వాత ఎరిక్ రాబర్ట్ సన్ అతడి సహకరాలు మిలానీ లయన్ సిఫార్సుతో బాధితుడిని ఆర్కే గ్లోబల్ యాప్ లో బాధితుడని చేర్పించారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టించడం ప్రారంభించారు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా ఐపివోలు దగ్గర చేస్తామని దాంతో భారీగా లాభాలు వస్తాయని ఆశచూపారు. బాధితుడు అందుకు అంగీకరించడంతో కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లను సూచించి వాటిలోకి ఆన్‌లైన్‌లోనే నగదు బదిలీ చేయాలని సూచించారు అలా ఆర్కే గ్లోబల్ యాప్ ద్వారా జూలై 16 నుంచి నగదు బదిలీ ప్రారంభించారు ఇలా పెట్టిన పెట్టుబడికి కోట్లల్లో లాభాలు వచ్చినట్లు డీమార్ట్ ఖాతాలో కనిపించేవి. జులై 22న 2000 ఉప సంహరించుకోవాలనుకోవడంతో బాధితులలో నమ్మకం ఏర్పడింది.

సెప్టెంబర్ 19 కొంత డబ్బులు డ్రా చేసుకున్నాడు. అయితే యాప్‌లో కనిపించిన మొత్తం డ బ్బు మాత్రం ఖాతాలోకి జమ కాలేదు.అయితే ఆ సమయానికి లాభాల తో కలిపి ఖాతాలో 37.5 కోట్ల కనిపిస్తోంది నగదు డ్రా కోసం ఆ మొత్తం పై రెండు శాతం చెల్లించాలని మళ్లీ మోసానికి పాల్పడ్డారు. దీంతో సు మారు రూ. 75 లక్షల చెల్లించాడు. అనంతరం సెబి తనిఖీల పేరిట మ రో రెండు కోట్ల జమ చేయాలని సూచించారు అంత చెల్లించలేనని బాధితుడు చెప్పడంతో 1.25 కోట్లు రుణంగా ఇస్తామంటూ నమ్మించారు. మిగిలిన రూ.75 లక్షలను బాధితుడితో జమ చేయించుకున్నారు. అలా ఆయన నుంచి 8.15 కోట్ల రూపాయలను సైబర్ కేటుగాళ్లు కాజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News