Wednesday, January 22, 2025

ట్రోల్ చేస్తే తాట తీసుడే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌సి కవితతో పాటు పలువురు తెలంగాణ ప్రభుత్వ పెద్దలను ట్రోల్ చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రజాప్రతినిధులు, మహిళలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలలోని 8 మందిని సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అట్టాడ శ్రీనివాస రావు, చిరసాని మణికంఠ, బద్దంజి శ్రవణ్, మోతం శ్రీను,పెరిక నాగవెంకట కిరణ్, వడ్లూరి నవీన్, బొల్లి చంద్రశేఖర్, బిల్ల శ్రీకాంత్‌లు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ట్రోలింగ్‌లపై 20 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మరో 30 మంది ట్రోలర్స్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్ చేస్తున్నట్లుగా తెలిపారు. సబ్ స్ర్కైబర్స్, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని వెల్లడించారు.

ఈ మధ్య ఎంఎల్‌సి కవితపై ఎక్కువగా ట్రోలింగ్ జరిగినట్లుగా గుర్తించామన్నారు. మహిళల ఫొటోలను అసభ్యంగా తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వంలోని పెద్దలపైనా కూడా మార్ఫింగ్ ఫొటోల పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ డిసిపి స్నేహా మెహ్రా తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఆంధ్ర ట్రోలర్స్ కూడా ఉన్నారు. విజయనగరానికి చెందిన అట్టాడ శ్రీనివాసరావు ట్రోలర్ కుర్రాడు పేరుతో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవితపై పలు రకాల ట్రోల్స్ పోస్ట్ చేశారు. ఇవి అభ్యంతరకరకంగా ఉండటంతో కేసు పెట్టారు. అలాగే కడపకు చెందిన సిరసాని మణికంట మాస్ అబ్బాయి పేరుతో సోషల్ మీడియా అకౌంట్ నడుపుతున్నారు.

అతన్ని కూడా అరెస్ట్ చేశారు. యంకన్న ట్రోల్స్ పేజీని నడిపే బద్దంజ్ శ్రావణ్ , తెలుగు ట్రోల్ న్యూ నడిపే మోటం శ్రీను, చింటూ ట్రోల్స్ నడిపే పేరక నాగ వెంకట జ్యోతి కిరణ్, టీమ్ ఆఫ్ ట్రోలింగ్, బంతిపువ్వు ట్రోలింగ్ పేజీలు నడిపే వడ్లూరి నవీన్, చందూ ట్రోల్స్ పేజీని నిర్వహించి చంద్రశేఖర్, చెవిలో పువ్వు పేరుతో ట్రోల్ చేసే శ్రీకాంత్‌లను తెలంగాణ సైబర్ క్రైమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇరవైమందిపై కేసులు పెట్టారు. వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ట్రోల్స్ చేస్తున్న వారంతా 20, 30 ఏళ్ల లోపు వారేనని పోలీసులు ప్రకటించారు. వీరంతా ఇలా అర్థం పర్థం లేని ట్రోల్స్ చేసి భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు. ట్రోల్స్ కించపరిచేలా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసకుుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News