Monday, December 23, 2024

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ డిజిపి కార్యాలయం వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు మాదాపూర్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని అందిన ఫిర్యాదుల మేరకు మంగళవారంనాడు ఈ కార్యాలయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం గాంధీ భవన్ కు చేరుకున్నారు.గాంధీ భవన్ నుండి నేతలు డిజిపి కార్యాలయం వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు డిజిపి ఆపీస్ వైపునకు వెళ్లకుండా గాంధీ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. బారికేడ్లను దాటుకొని డిజిపి ఆఫీస్ వైపునకు వెళ్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు గాంధీ భవన్ వద్దే బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు.

పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ ను కాంగ్రెస్ పార్టీ నియమించుకుంది. కర్ణాటక రాష్ట్రంలో కూడ కాంగ్రెస్ పార్టీకి సునీల్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. సునీల్ సూచనలు, సలహా మేరకు ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. అయితే సునీల్ కు చెందిన కార్యాలయాన్ని సీజ్ చేశారు. అయితే సునీల్ కార్యాలయంలో తమ పార్టీకి చెందిన డేటాను చోరీ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరును పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News