Friday, January 10, 2025

ఘరానా సైబర్ నేరస్థుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఆరు నెలల వేటాడి పట్టుకున్న రాచకొండ సైబర్ క్రైం పోలీసులు
ఆన్‌లైన్ షాపింగ్ చేసిన విడో ఖాతా నుంచి రూ.28లక్షలు కొట్టేసిన నిందితుడు
వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్
Cyber criminal arrested in Hyderabad

మనతెలంగాణ, సిటిబ్యూరో: లాటరీ వచ్చిందని చెప్పి అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న అంతరాష్ట్ర సైబర్ నేరస్థుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.3,50,000 నగదు, బ్యాంక్ ఖాతాలోని రూ.21లక్షలు ఫ్రీజ్ చేశారు. నాలుగు మొబైల్ ఫోన్లు, తొమ్మిది సిమ్ కార్డులు, రెండు డెబిట్ కార్డులు, ఐదు బ్యాంక్ పాస్‌బుక్‌లు, నాలుగు చెక్‌బుక్‌లు, ఆధార్, పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేరెడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం, నవాడా జిల్లా, వర్షాలీగంజ్, కోచేగాన్ గ్రామానికి చెందిన రాజేష్ కుమార్ మహతో కొంత మందిని టీముగా ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్న వారిని మోసం చేస్తున్నాడు. నిందితుడిపై తెలంగాణ రాష్ట్రంలో 22 కేసులు నమోదయ్యాయి. నిందితుడు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్న వారికి గిఫ్ట్ వోచర్లు కార్డులు, లాటరీ పేరుతో ఫోన్లు చేసి మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలగిరికి చెందిన బాధితురాలు వెంకాయమ్మ భర్త చనిపోయాడు. అతడి ఇన్సూరెన్స్ కింద వచ్చిన డబ్బులు బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి.

ఆగస్టు, 2021లో ఈయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని షాప్‌క్లూస్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ పెట్టింది. ఆగస్టు 30వ తేదీ, 2021న బాధితురాలికి ఫోన్ వచ్చింది, తాన పేరు అశోక్ అని మీరు షాప్‌క్లూస్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. మీరు షాపింగ్ చేసినందుకు లాటరీలో రూ.15,01,500 విలువైన కారు గెల్చుకున్నారని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన బాధితులురాలు నిందితుడు చెప్పినట్లు చేసింది. ముందుగా ఖర్చుల కింద డబ్బులు చెల్లించాలని చెప్పడంతో రూ.8,500 పంపించింది. తర్వాత నిందితుడు వేరే ఫోన్ నంబర్లతో ఫోన్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితరాల కింద డబ్బులు పంపించాలని చెప్పడంతో దఫదఫాలుగా రూ.28,86,820 పంపించింది. తర్వాత నిందితులు ఫోన్‌ను స్వీచ్ ఆఫ్ చేయడంతో మోసం పోయానని గ్రహించి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితుడిపై రాచకొండలో 4, హైదరాబాద్‌లో 6, సైబరాబాద్‌లో 7, ఆసిఫాబాద్, నిర్మల్‌లో, సూర్యపేట, న్యూఢిల్లీలో, జాన్సీలో ఒకటి చొప్పున కేసులు ఉన్నాయి. నిందితుడు ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలపై గతంలో పలువురు సైబర్ నేరస్థులతో పనిచేయడంతో పూర్తిగా తెలుసుకున్నాడు. నకిలీ ఐడి ఫ్రూప్స్‌తో సిమ్‌కార్డులు, బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేశాడు. పలువురి వద్ద బ్యాంక్ ఖాతాలను తీసుకుని వారికి 5 నుంచి 10శాతం కమీషన్ ఇచ్చేవాడు. పలువురు అమాయకులను మోసం చేసేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి టెలీకాలర్లతో బాధితులకు వివిధ రకాల ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ చేయించేవాడు. బాధితులు ఇంటర్‌నెట్ క్రెడెన్షియల్స్, ఓటిపి తెలుసుకుని వారి బ్యాంక్ ఖాతాలోని డబ్బులను వారికి ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునేవారు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్ వెంకటేష్ దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News