Thursday, December 19, 2024

ట్రేడింగ్ పేరిట మోసాలు.. సైబర్ నేరగాళ్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించిన కేేటుగాళ్లు బల్కంపేటకు చెందిన వ్యక్తి నుంచి రూ.58.6 లక్షలు కాజేశారు. మొత్తం రూ. 13 కోట్ల మోసాలు చేసినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా నిందితులపై 45 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లను ఉప్పల్ కు చెందిన సురేంద్ర, నరేష్ బాబు గా గుర్తించారు. ట్రేడింగ్ పేరుతో నిందితులు మోసాలుచేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్నారు. ఇప్పటి  వరకు సైబర్ నేరగాళ్లకు 8 ఖాతాలు సమకూర్చినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News