Wednesday, March 12, 2025

కాంగ్రెస్ ఎంఎల్ఎకు న్యూడ్ వీడియో కాల్… సైబర్ నేరగాళ్లు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: న్యూడ్ వీడియో కాల్స్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారం రోజుల క్రితం ఎంఎల్ఎ వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేశారు. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్‌కు స్క్రీన్ రికార్డు పంపి నిందితులు సదరు ఎంఎల్ఎ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు మధ్య ప్రదేశ్ లో ఉన్నట్టు గుర్తించారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేసి నకిరేకల్‌కు తీసుకొచ్చారు. పోలీసులు నిందితులను నల్గొండ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News