Wednesday, January 22, 2025

కామారెడ్డిలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: జిల్లాలో సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. కేటుగాళ్లు, జొన్నల ప్రసాద్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.79 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రసాద్ తన ఏటిఎం కార్డు యాక్టీవేట్ కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసి.. ఓ నెంబర్ కు కాల్ చేశాడు. దీంతో సైబర్ కేటుగాళ్లు ఏటిఎం కార్డు యాక్టీవేషన్ కోసం ఓటిపి పంపించారు.బాదితుడు ఆ ఓటిపిని ఎంటర్ చేసిన తర్వాత అతని ఖాతా నుంచి నగదు మాయం అయ్యింది.దీంతో బాధితుడు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Cyber Criminals cheated a Man in Kamareddy

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News