Tuesday, January 21, 2025

వైద్యురాలిని బెదిరించి రూ.1.60కోట్లు వసూలు

- Advertisement -
- Advertisement -

మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించి వృద్ధ వైద్యురాలి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన సైబర్ నేరస్థులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.10.08లక్షల నగదు,17 చెక్‌బుక్‌లు, 22 డెబిట్ కార్డులు, 8 పాస్‌బుక్‌లు, రెండు మొబైల్ ఫోన్లు, ఆరు స్టాంపులు, ల్యాప్‌టాప్, ఐదు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి సిసిఎస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ర్టం, సూరత్‌కు చెందిన సాగర్ గోరాథన్‌భాయ్ ప్రజాపతి అలియాస్ సాగర్ ప్రజాపతి కూక్‌గా పని చేస్తున్నాడు. భావ్‌నగర్‌కు చెందిన పర్‌మార్ కిరీటి నాతుభాయ్, కోల్ కతాకు చెందిన దీపక్ రావత్ కలిసి నేరాలు చేస్తున్నారు.

అమాయకులకు ఫోన్లు చేసి ఫెడెక్స్‌లో కొరియర్ వచ్చింది. దానిలో డబ్బులు పంపిస్తున్నారని, మీ మీద మనీలాండరింగ్ కేసు నమోదయిందని బెదిరిస్తున్నారు. నిందితులు సికింద్రాబాద్‌కు చెందిన వృద్ధ వైద్యురాలు(75)కు ఫోన్ చేసి తాము ముంబాయి పోలీసుం మాట్లాడుతున్నామని మీపై మనీలాండరింగ్ కేసు నమోదయిందని బెదిరించారు. సిబిఐ అధికారులు అరెస్టు చేసేందుకు వస్తున్నారని చెప్పడంతో బెదిరించారు. అరెస్టు కాకుండా ఉండేందుకు డబ్బులు పంపిచాలని చెప్పడంతో వైద్యురాలు రూ.1,60,00,000 కోట్లు నిందితులు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు పంపించింది. తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ ప్రసాద్ రావు, ఎస్సైలు అభిషేక్, మన్మోహన్, హెచ్‌సి శ్రీనివాస్, పిసిలు సతీష్, భాస్కర్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News