Saturday, November 23, 2024

ఆన్‌లైన్ ఆర్డర్లే ఆయుధాలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పడుతున్న వారిని టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నారు సైబర్ నేరస్థులు. ఇటీవలి కాలంలో వినియోగదారులు ఏ వస్తువు కావాలన్నా కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతున్నారు. దీనికి ఉన్న పలు ఆన్‌లైన్ యాప్‌లు పలు డిస్కౌంట్లు పెట్టడంతో వాటికి ఆకర్శితులు అయి కొంత మంది, కొంతమంది షాపులకు వెళ్లి కొనుగోలు చేసే సమయం లేకపోవడంతో ఆన్‌లైన్‌లో తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. సాధారణంగా ఆన్‌లైన్ ఆర్డర్లు పెట్టిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వాటిని సంబంధిత డెలివరీ బాయ్స్ వస్తువులను అందజేస్తారు. ఆర్డర్ నుంచి డెలివరీ వరకు కొంత సమయం తీసుకుంటారు. వస్తువు ఆర్డర్‌ను తీసుకోవడం వాటిని ప్యాక్ చేయడం కొరియరల్‌లో వేయడం చేసి సరికి సమయం పడుతుంది. ఈ మధ్యలో పలువురు వినియోగదారులు తాము ఇచ్చిన ఆర్డర్ ఇంకా రావడంలేదని ఆత్రుతతో గూగుల్‌లో వెతుకుతున్నారు. ఇక్కడే వారు చేసిన తప్పును సైబర్ నేరస్థులు ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇలా ఆర్దర్ ఎక్కడ ఉందో వెతికిన వారిని టార్గెట్‌గా చేసుకుని సైబర్ నేరస్థులు దోచుకుంటున్నారు.

గూగుల్‌లో వెతికిన వారి మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి వారి వివరాలు తెలుకుంటున్నారు. మీ ఆర్డర్ త్వరలోనే అందిస్తామని, ఫలానా చోట ఆగిపోయిందని మాయమాటలు చెప్పి చివరికి కొంత డబ్బులు చెల్లిస్తే మీ ఆర్డర్ డెలివరీ అవుతుందని నమ్మిస్తున్నారు. వీరి మాటలు నమ్మిన వారు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. బాధితులు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయగా వారి బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటిపి తదితరాలు తెలుసుకుని బ్యాంక్‌లో ఉన్న లక్షలాది రూపాయలు తమ బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జోరుగా సాగుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టిన వారు ఆయా యాప్‌ల్లోకి వెళ్లి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలని పోలీసులు ఎన్నిసార్లు చెబుతున్నా వినియోగదారులు మారడంలేదు. అదే తప్పులను పదేపదే చేస్తూ సైబర్ నేరస్థుల చేతుల్లో నిండా మునుగుతున్నారు. ఇలాంటి కేసులు ఇటీవలి కాలంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయి.

క్షణాల్లో ఫోన్లు…
బాధితులు ఆన్‌లైన్ ఆర్డర్ కోసం గూగుల్‌లో వెతికిన క్షణాల్లోనే సైబర్ నేరస్థులు ఫోన్లు చేస్తున్నారు. బాధితులతో తీయగా మాట్లాడి వారి వివరాలు తెలుసుకుంటున్నారు. మీరు ఎలాంటి బాధపడవద్దని ఆర్డర్ త్వరలోనే డెలివరీ ఇస్తామని ఓదార్చినట్లు నటిస్తూ వారిని ఆన్‌లైన్ పేమెంట్ చేసే విధంగా ఒప్పిస్తున్నారు. బాధితులు సైబర్ నేరస్థులు పంపిన లింక్ క్లిక్ చేయడమో లేక ఆన్‌లైన్ పేమెంట్ చేయడమో చేస్తున్నారు. పేమెంట్ చేసిన తర్వాత సైబర్ నేరస్థులు వారి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకుని క్షణాల్లో డబ్బులను తమ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. తమ బ్యాంక్ నుంచి డబ్బులు వేరే వారి బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాతగాని బాధితులకు తాము మోసపోయామని గ్రహించడంలేదు. ఈ విషయం తెలియగానే వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

యాప్‌ల్లోనే ఆర్డర్ల సమాచారం…
వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత అందులోనే ఆర్డర్ల విషయంలో ఎప్పటి కప్పుడు కంపెనీ వారు స్టేటస్‌ను అప్‌డేట్ చేస్తారు. దీనిని ఆర్డర్ ఇచ్చిన వారు పట్టించుకోకుండా గూగుల్‌లో వితకడంతో సైబర్ నేరస్థులకు చిక్కుతున్నారు. కస్టమర్ కేర్ నంబర్ కూడా ఆ యాప్‌లోనే ఉండడంతో వాటిని చూసి కాల్ చేస్తే వారు ఆర్డర్ డెలివరీ గురించి మొత్తం వివరాలు చెబుతారు. దీనిని మరిచిన వారు మాత్రమే సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News