Monday, January 20, 2025

పార్ట్ టైం జాబ్ పేరుతో రూ.53లక్షలు దోచుకున్న సైబర్ నేరస్థులు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: పార్ట్ టైం జాబ్ చేస్తే అధికంగా డబ్బులు వస్తాయని నమ్మించి నగరానికి చెందిన ఇద్దరు బాధితులను నిండా ముంచారు సైబర్ నేరస్థులు. సైబర్ నేరస్థుల చేతిలో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు బాధితులు ఆన్‌లైన్‌లో సైబర్ నేరస్థులు పరిచయమయ్యారు. పార్ట్‌టైం జాబ్ చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయని నమ్మించారు,ద దానికి ముందుగా డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పారు. ముందుగా బాధితులు తక్కువగా డబ్బులు డిపాజిట్ చేయించారు.

తర్వాత లింక్ పంపించి పనిఅప్పగించారు. దాని ద్వారా పనిపూర్తి చేయాలని చెప్పారు. సైబర్ నిందితులు చెప్పినట్లు చేయడంతో బాధితులకు డబ్బులు పంపించారు. దీనిని ఆశగా చూపించి అధికంగా డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువగా డబ్బులు వస్తాయని చెప్పారు. వారి మాటలు నమ్మిన బాధితులు ఒకరు రూ.48లక్షలు, రాంనగర్‌కు చెందిన మహిళ రూ.5లక్షలు డిపాజిట్ చేశారు. బాధితులు డిపాజిట్ చేసిన తర్వాత నుంచి సైబర్ నేరస్థులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. ఇలాంటి వాటిపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News