Saturday, December 21, 2024

విహెచ్‌కు జలక్…

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబర్ నేరస్థులు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హన్మంతరావును మోసం చేయాలని చూశారు. అతడిని టార్గెట్‌గా చేసుకుని డబ్బులు దోచుకోవాలని ప్లాన్ వేశారు. మాజీ ఎంపి హరి రామజోగయ్య పేరిట డబ్బులు వసూలు చేయాలని చూశారు. కానీ నిందితులు చేసిన ఫోన్ నంబర్ హరి రామజోగయ్య ది కాక పోవడంతో విహెచ్ అప్రమత్తమయ్యారు. సైబర్ నేరస్థులు వి. హన్మంత రావుకు ఫోన్ చేశాడు. తాను హరిరామజోగయ్యను మాట్లాడుతున్నానని, ఆపదలో ఉన్నానని,

గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని సైబర్ నేరస్థుడు కోరాడు. ఫోన్ నంబర్ హరిరామజోగయ్యది కాకపోవడంతో అనుమానం వచ్చిన విహెచ్, హరిరామజోగయ్య ఇంటికి ఓ వ్యక్తిని పంపించాడు. ఫోన్ చేసింది హరిరామజోగయ్య కాదని ఫేక్ కాల్ అని తెలిసింది. వెంటనే పశ్చిమగోదావరి పోలీసులకు, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు విహెచ్‌కు ఖమ్మం నుంచి ఫోన్ వచ్చిందని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు వెతుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News