Thursday, November 21, 2024

వైద్యుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు

- Advertisement -
- Advertisement -

పోలీసుల పేరు చెప్పి హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడిని నిండాముంచారు సైబర్ కేటుగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన వైద్యుడికి ఓ సైబర్ నేరస్థుడు ఫోన్ చేశాడు. తాను ముంబాయి సైబర్ క్రైం డిసిపిని మాట్లాడుతున్నట్లు చెప్పాడు. మీ ఆధార్ కార్డుకు పలు బ్యాంక్ ఖాతాలు అనుసంధానంగా ఉన్నాయని, వాటి ద్వారా రూ.8వేల కోట్ల లావాదేవీలు జరిరగాయని తెలిపాడు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదదైందని బెదిరించాడు.

రూ.12.75లక్షలు చెల్లించాలని డాక్టర్‌ను డిమాండ్ చేశారు. లేకుంటే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించడంతో, బెదిరిపోయిన డాక్టర్ సైబర్ నేరస్థులు చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ.12.75లక్షలు పంపించాడు. తర్వాత తాను మోసపోయానని గ్రహించిన వైద్యుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు కాల్స్ వెస్తే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News