Saturday, December 21, 2024

చైల్డ్ పోర్నోగ్రఫి కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నుంచి అప్‌లోడ్ చేస్తున్న మూడు ఐపిల గుర్తింపు
రసూల్‌పుర, టోలిచౌకి, వారాసిగూడ కేంద్రంగా దందా నిందితుల గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా చైల్డ్ పోర్నోగ్రఫి వీడియోల వ్యవహారంపై సైబర్ టిప్‌లైన్ నిఘా సారించి మూడు ఐపిల నుంచి వీడియోలు అప్‌లోడ్ అవుతున్నట్లు గుర్తించింది. చైల్డ్ పోర్నోగ్రఫి నేరగాళ్ల ఆటకట్టించే లక్ష్యంతో ఏర్పాటైన సైబర్‌టిప్ లైన్ తెలంగాణలో మూడు చైల్ పోర్న్ కేసులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టడంతో నగరంలోని రసూల్ పురా, టోలిచౌకి, వారాసి గూడా ప్రాంతాల నుంచి చైల్డ్ పోర్న్‌గ్రఫీ వీడియోస్ అప్‌లోడ్ అవుతున్నట్లు గుర్తించారు. సైబర్ టిప్ లైన్ సమాచారం, సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు మేరకు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న చైల్డ్ పోర్న్ గుట్టు రట్టు కావడంతో నిందితులపై కేసులు నమోదు చేయనున్నారు. గత కొన్నేళ్లుగా చైల్డ్ పోర్న్ వీడియోస్‌పై నిఘా పెట్టిన సైబర్ టిప్ లైన్ అప్‌లోడ్ చేసిన వీడియోస్ అధారం గా విచారణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా మూడు ఐపి అడ్రెస్‌ల నుంచి చైల్డ్ పోర్న్‌గ్రఫి వీడియోలు అప్‌లోడ్ చేసినట్టు పసిగట్టిన సైబర్ టిప్ లైన్ ఆ వివరాలను సిఐడికి అందించడం తో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సై బర్ టిప్‌ను తెలంగాణ సిఐడికి అందించిన వివరాల ఆధారంగా, ఐపి అడ్రస్‌ల ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈక్రమంలో నగరంలోని రసూ ల్‌పుర, టోలిచౌకి, వారాసిగూడా ప్రాంతాల నుంచి వీడియోస్ అప్‌లోడ్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ మూడు ప్రాంతాల నుంచి 2017, 2019, 2020లలో వీడియోలు అప్‌లోడ్ చేసినట్లు గుర్తించిన పోలీసు అధికారులు చైల్డ్ పోర్న్‌గ్రఫీ ముఠాలపై కేసులు నమోదు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 2021లో చైల్డ్ పోర్నోగ్రఫీ అప్ లోడర్స్ పై సిబిఐ రైడ్ చేసిన విషయం విదితమే. 2021లో హైదరాబాద్ కేంద్రంగా చైల్డ్‌పోర్న్‌గ్రఫీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తోన్న 16 మం దిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 2020 లో అప్‌లోడ్ చేసిన విడియోలను ఫార్వర్డ్ చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశా రు. తాజాగా సైబర్ టిప్‌లైన్ మరో మూడు కేసులను గుర్తించింది. ఈ నేపథ్యంలో నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్ యుఎస్ సంస్థ చేసుకున్న ఒప్పందం ఫలితంగా చైల్ పోర్నోగ్రఫీ వీడియోలపై ఫిర్యాదు చేసేందుకు సెంట్రలైజ్‌డ్ రిపోర్టింగ్ సిస్టమ్ సైబర్‌టిప్ లైన్ ఏర్పాటుచేసిన విష యం తెలిసిందే. ఈ రిపోర్ట్ ని ఎన్‌సిఆర్‌బి ద్వా రా మెట్రో నగరాలకు చేరవేసే వ్యవస్థను సైతం ఏర్పాటు చేశారు.

Cyber Police find 3 Child Porngraphy Video Uploaders in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News