Monday, December 23, 2024

మాజీ సిఎం ఫడ్నవీస్‌కు సైబర్ పోలీస్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

Cyber ​​police notices to former CM Fadnavis

ముంబై : అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన కేసులో తమ ఎదుట ఆదివారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ముంబై సైబర్ పోలీసులు బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్న ఫడ్నవీస్ ఉన్నారు. పోలీసులే తమ ఇంటికి వచ్చి కావలసిన సమాచారం తన నుంచి తీసుకుంటారని , తాను బికెసి సైబర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదని సీనియర్ పోలీస్ అధికారి తనకు తెలియచేసినట్టు ఫడ్నవీస్ వెల్లడించారు. ఐపీస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై నమోదైన కేసులో ఫడ్నవీస్ సాక్షి అని రాష్ట్రప్రభుత్వం గతంలో కోర్టుకు తెలియచేసింది. ఈ కేసులో కొన్ని ప్రశ్నలు ఇదివరకు సీల్డు కవర్‌లో పంపినా, రెండుసార్లు నోటీసులు , మూడు లేఖలు పంపినా ఫడ్నవీస్ సమాధానం ఇవ్వక పోవడంతో ఆదివారం సైబర్ పోలీస్ ముందు హాజరు కావాలని తాజాగా నోటీస్ పంపామని పోలీస్ అధికారి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News