Sunday, November 17, 2024

వచ్చే ఏడాది నుంచి కర్నాటక డిగ్రీ కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

cyber security course

బెంగళూరు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని డిగ్రీ కోర్సుల్లో సైబర్‌ సెక్యూరిటీ కోర్సు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందని కర్ణాటక ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ బి. తిమ్మేగౌడ శుక్రవారం తెలిపారు. ‘సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్ మంత్ ప్రోగ్రామ్ 2022’ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు, దీనిని ఉన్నత విద్య, సమాచార సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ సి ఎన్ అశ్వత్ నారాయణ్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అతీతంగా ఉన్నత విద్యాశాఖలో కొత్త సైబర్‌ సెక్యూరిటీ కోర్సు అమల్లోకి వస్తుందని తిమ్మేగౌడ తెలిపారు.

“మేము ఇప్పటికే ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డిజిటల్ ఫ్లూయెన్సీ పోర్షన్‌లను ప్రవేశపెట్టాము. అయితే, వచ్చే ఏడాది ‘నాస్కామ్’ సహకారంతో, డిగ్రీ విద్యార్థులందరికీ వారి స్ట్రీమ్‌లతో సంబంధం లేకుండా సైబర్‌ సెక్యూరిటీ కోర్సును తప్పనిసరి చేస్తాం”అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News