Wednesday, January 22, 2025

సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయిన వ్యక్తి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వెల్దుర్తిః సైబార్ నేరాస్తుల మాయ మాటలు విని ఓటిపి నెంబర్ చెప్పడంతో ఏకైకంగా అమాయకుడి ఖాతా నుండి రూ.62,034 నగదును దొపిడి చేశారు. ఈ సంఘటన మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వెంకటేశం పోలీసుల ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివరాలు ఇలా ఉన్నాయి. మేము ఎస్‌బిఐ బ్యాంకు నుండి మాట్లాడుతూన్నామని, మీకు క్రెడిట్ కార్డు వుందని, ఆ యొక్క కార్డు మీరు వాడకపోవడం వల్ల కార్డు పనిచేయడం లేదని, మీకు ఆ యొక్క కార్డుకు బదులుగా మారో కొత్త కార్డు ఇవ్వడం జరుగుతుందని, ఈ ప్రక్రియ పూర్తి కావలంటే మీ యొక్క ఖాతాకు లింక్ ఉన్న ఫోన్‌కు ఓటిపి వస్తుందని, వచ్చిన ఓటిపిని మాకు చెప్పితే మీ యొక్క కార్డు అప్లికేషన్ పూర్తి కావడం జరుగుతుందని దానితో మీకు కొత్త కార్డు వస్తుందని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో వారి మాటాలు నమ్మిన నేను నా ఫోన్‌కు వచ్చిన మూడు ఓటిపిలను చెప్పాను.

రెండు గంటల తర్వత నా యొక్క ఫోన్‌కు మూడు మెసేజ్‌లు రావడంతో అందులో ఒక్కసరి రూ.48,840, రెండో సరి రూ.10,137, మూడో సరి రూ.3,070 లు ఖాతా నుండి కట్ అయినట్లు వచ్చిన మెసేజ్ ను చూసిన నేను మోసపోయినట్లు గమనించిన నేను పోలీస్‌లకు ఫిర్యాదు చేశాను. స్పందించిన పోలీసులు బాధితుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News