Wednesday, January 22, 2025

దొంగలనుకుని పోలీసులనే చితకబాదారు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: దొంగలనుకుని పోలీసులనే కర్రలు, బెల్టులతో ప్రజలే చితకబాదిన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ గౌడ్ నేతృత్వంలోని పోలీసు బృదంపై సర్దార్ మహల్ వద్ద కొందరు వ్యక్తులు దాడిచేశారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించినపుడు ఈ ఘటన జరిగింది.
సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున పక్కా సమాచారం మేరకు నలుగురు కానిస్టేబుల్స్, ఇద్దరు ఇన్ఫార్మెంట్స్‌తో కూడిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల బృందం సర్దార్ మహల్ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుంది.

ఆ అపార్ట్‌మెంట్‌లో బంగారం స్మగ్లింగ్ కేసులో అనుమానితుడు ఒవైస్ దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అపార్ట్‌మెంట్‌లోని పెంట్ హౌస్‌లో దాక్కుని ఉన్న ఒవైస్‌ను సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు బృందం పట్టుకుంది. అయితే పోలీసులను చూసి అనుమానితుడు ఒవైస్ గట్టిగా కేకలు వేయడంతో ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే వారితోపాటు ఇరుగు పొరుగు వారు అక్కడకు చేరుకున్నారు. వీరిలో అత్యధికులు స్వర్ణకారులు ఉన్నారు. అయితే ఒవైస్ నుంచి బంగారాన్ని లాక్కోవడానికి దొంగలు ప్రయత్నిస్తున్నారనుకుని స్థానికులు భావించారు. పోలీసులను కర్రలు, బెల్టులతో చితకబాదారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News