మన తెలంగాణ/సిటిబ్యూరో: వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. యువకుడిని కాపాడిన పోలీసులకు అవార్డులు అందజేశారు. భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిగా నిండడంతో మంగళవారం సాయం త్రం ఎనిమిది గేట్లు ఎత్తి వేశారు. దీంతో ఒక్కసారిగా పలు నదులు పొంగిపొర్లా యి. ఈ క్రమంలోనే వికారాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అరవింద్ గౌ డ్ బైక్‌పై దర్గా కలీజ్ ఖాన్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లేందుకు వచ్చాడు. శంషాబాద్ వైపు వెళ్లుటకు హిమాయత్‌సాగర్ సర్వీస్ రోడ్డు వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా బైక్‌తో సహా నీటిలో కొట్టుకుపోయాడు. వంతెనకు ఉన్న ఇనుప గ్రిల్ ను పట్టుకుని ఆగాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు రికవరీ వ్యాన్ బృందం హెడ్ కానిస్టేబుల్ బేగ్, డ్రైవర్ మల్లాంగ్ షా, హెల్పెర్ రా కేష్, విజయ్ నీటిలో కోట్టుకు పోతున్న యువకుడిని కాపాడా బయటికి తీసుకు ని వచ్చారు. యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసులను తన కార్యాలయానికి పిలిపించుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర వారిని అభినందించి, రివార్డులు అందజేశారు.
Salute to @CYBTRAFFIC @HYDTP .
Successful Rescue operation,man was stuck near Himayat Sagar after doors lifted. #HyderabadRains #trafficpolice #Telanganarains @HiHyderabad @swachhhyd @Hyderabad_Bot @balaji25_t @TS_AP_Weather pic.twitter.com/Sx5z8USwiU— Mohammed Farzan Ahmed (@FarzanHyderabad) July 26, 2022
Abolishing #111GO
People are going to pay a the price.
Mother nature ain't gonna be Kind on you.#HyderabadRains https://t.co/vknafwE7AY— Sandeep Vangala ✋🇮🇳 (@SandeepVIOC) July 26, 2022