పిఎం లైఫ్‌సేవింగ్ పతకం అందుకున్న పిసి శివకుమార్
ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడిన పిసి
హైదరాబాద్: ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి పోలీసు ముందుకు రావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. ప్రధానమంత్రి పోలీస్ మోడల్ ఫర్ లైఫ్ సేవింగ్ అవార్డు అందుకున్న కేశంపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్రను కలిశారు. అక్టోబర్9,2017న రాత్రి 11.15 గంటల సమయంలో కానిస్టేబుల్ జి. శివకుమార్ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైం డ్యూటీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భారీ వర్షాలకు షాద్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన గడిగెల శేఖర్ గౌడ్ చెరువులో వరదుకు కొట్టుకుని పోయాడు. డయల్ 100 కాల రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు బాధితుడిని కాపాడేందుకు ప్లాన్ చేశారు. 100 మీటర్ల దూరంలో ఉన్న బాధితుడిని కాపాడేందుకు తాడు సాయంతో వరదలో వెళ్లిన శివకుమార్ బాధితుడిని క్షేమండా ఒడ్డుకు తీసుకుని వచ్చాడు. వెంటనే బాధితుడికి వైద్య సాయం అందించి బంధువులకు అప్పగించాడు. కానిస్టేబుల్ సాహసాన్ని అభినందిస్తూ భారత ప్రభుత్వం 2018 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ పతకాన్ని అందించింది. పతకాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర కానిస్టేబుల్ శివకుమార్‌కు అలంకరించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎసిపి కుషాల్కర్, ఇన్స్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.