Tuesday, November 5, 2024

ఈఓడబ్లూ కార్యాలయాన్ని ప్రారంభించిన సైబరాబాద్ సిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్థిక నేరాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయని, వాటిని అడ్డుకోవడానికి ఎకనామిక్ అఫెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో రినోవేషన్ చేసిన ఈఓడబ్లూ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ఆర్థిక నేరాలు, గొలుసుకట్టు నేరాఉల, గుర్తింపులేని చిట్ ఫండ్స్ మోసాలు, వ్యవస్థీకృత ఆర్థిక నేరాలు పరిశోధించడానికి 2018, జులైలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఈఓడబ్లూ విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

దీనిని మరింత బలోపేతం చేస్తూ, ఆధునీకరించామని తెలిపారు. ఈఓడబ్లూ డిసిపి స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. ఆర్థిక నేరాల పరిశోధన త్వరితగతిన పూర్తి చేసి నేరస్థులకు శిక్షపడేలా చేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వ్యవస్థీకృత నేరాలపై ప్రజలకు అవగాహన పెంచడానికి రూపొందించిన పత్రాలను విడుదల చేశారు. అలాగే ట్రాఫిక్ జంక్షన్లు, బస్‌స్టాప్‌లు తదితర ప్రాంతాల్లో పొస్టర్లు, కరపత్రాలు, ఆడియో వాయిస్ ఓవర్లతో ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ సిపి ట్రాఫిక్ నారాయణనాయక్, డిసిపిలు నారాయణరెడ్డి, సందీప్, జగదీశ్వర్‌రెడ్డి, నితికాపంత్, కవిత, శ్రీనివాసరావు, రితిరాజ్, యోగేష్‌గౌతం, ఎడిసిపి రష్మీపెరుమాల్, ఎడిసిపి నంద్యాల నరసింహారెడ్డి, ఎడిసిలు నరసింహారెడ్డి, రవికుమార్, వెంకట్‌రెడ్డి, ఎసిపి పురుషోత్తం, ఇన్స్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News