Monday, December 23, 2024

క్షేత్రస్థాయికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలి

- Advertisement -
- Advertisement -

Cyberabad CP review meeting on road safety

వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించాలి
రోడ్డు భద్రతపై సైబరాబాద్ సిపి సమీక్ష సమావేశం

హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీసులతో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు కారణాలను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను చేపట్టాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్, జంక్షన్ డెవలప్‌మెంట్, ట్రాఫిక్ కన్జెషన్, సైన్ బోర్డుల ఏర్పాటు, ఓఆర్‌ఆర్ వెంట గ్రామ సెంటర్ల నిర్మాణం, లింక్ రోడ్లు, ట్రాఫిక్ వలంటీర్ల సేవలపై పలు సూచనలు చేశారు.

భవన నిర్మాణాలకు సంబంధించిన చెత్తను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వేసేవారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సాయం కావాల్సి వస్తే వెంటనే లా అండ్ ఆర్డర్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన పిఎస్సైఓసి పోలీస్ కానిస్టేబుల్ సాయిబాబా, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విమెన్ పోలీస్ కమానిస్టేబుల్ అనూష, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హోంగార్డు ఎల్లయ్యకు సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో డిసిపి శ్రీనివాసరావు, రోడ్డు సేఫ్టీ డిసిపి ఎల్సీ నాయక్, ఎడిసిపి శ్రీనివాస్ రెడ్డి, శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ నాయుడు, బాలానగర్ ట్రాఫిక్ ఎసిపి చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News