Monday, December 23, 2024

ప్రధాని పర్యటనపై సైబరాబాద్ సిపి సమీక్ష

- Advertisement -
- Advertisement -

హెచ్‌ఐసిసి వద్ద మూడంచెల భద్రత
లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ
కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిన సిపి స్టిఫెన్

Cyberabad CP review on PMs visit

మనతెలంగాణ, సిటిబ్యూరో: బిజెపి జాతీయ కార్యావర్గ సమావేశాలు నిర్వహించినున్న హెచ్‌ఐసిసి వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. హెచ్‌ఐసిసిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో భద్రతపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ భద్రతా ఏర్పట్లలో భాగంగా ఎస్‌పిజిఎస్, బ్లూ బుక్‌కు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హెచ్‌ఐసిసి వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు, యాక్సెస్ కంట్రోల్‌తోపాటు విధ్వంస నిరోధక జాగ్రత్తలు తీసుకున్నామని, విఐపిల రక్షణ కోసం ప్రత్యేకంగా భద్రతా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

శాంతిభద్రతలు, ట్రాఫిక్ అధికారులు తమ విధులను సరిగా నిర్వహించాలని కోరారు. సమావేశాలకు విఐపిలు, వివిఐపిలు ఎక్కువగా వస్తారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని పోలీసులు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ అధికారులకు చెప్పాలని కోరారు. పోలీసుల అందరూ టీం స్పిరిట్‌తో పనిచేయాలని, విధుల పట్ల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విధుల పట్ల అలసత్వం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటన వివరాలు, రాక,బస, హాజరు తదితరాలపై చర్చించారు. బందోబస్తు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహించాల్సిన విధుల గురించి వివరించారు. వేదిక వద్ద ఏర్పాటు చేయనున్న కంట్రోల్ సెంటర్ నుంచి ఏదైనా సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అధికారులను నియమిస్తామని చెప్పారు. సమావేశంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, డిసిపిలు కల్మేశ్వర్, శ్రీనివాస్, శిల్పవల్లి, సందీప్, జగదీశ్వర్ రెడ్డి, కవిత, ఇందిర, ఎడిసిపి రవికుమార్, ఎడిసిపి రియాజ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News