Wednesday, January 22, 2025

ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన సైబరాబాద్ సిపి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. మేడ్చల్ జోన్‌లోని మేడ్చల్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశాలతో ఈనెల 17వ తేదీన ఎస్సై భూపాల్, ఎఎస్సై సచ్చిదానందమ్, కానిస్టేబుల్ శివానందం, ఫహీముద్దిన్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన స్కార్పియో వాహనం డ్రైవర్, మరో వ్యక్తి కారును అక్కడే వదిలేసి పారిపోయారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 150 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కారును సీజ్ చేసి మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. గంజాయి రవాణాను అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తన ఛాంబర్‌లో సోమవారం అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News