హైదరాబాద్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి పోలీసులు సూచనలు చేశారు. కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. కాలనీలు, ఇంటి పరిసరాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బైకులు, కార్లను ఇళ్ల ఆవరణలోనే పార్కింగ్ చేయాలని చెప్పారు. విలువైన వస్తువులను బైకులు, కార్లలో పెట్టొద్దనని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలన్నారు. పేపరు, పాలవారిని రావద్దని చెప్పాలని ఆయన వివరించారు. టైమర్ తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలని తెలిపారు. ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరే పెట్టుకోవాలన్నారు. ఇంటి డోర్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని సిపి కోరారు. పోలీస్ స్టేషన్, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర పెట్టుకోవాలని చెప్పారు. ప్రజలు,పోలీసుల సమన్వయంతో చోరీల నియంత్రణ సులభమవుతుందన్నారు. ఇంటికి నమ్మకమైన వాచ్ మెన్ ను నియమించుకోవాలని ఆయన చెప్పారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి పోలీసుల సూచనలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -