Tuesday, December 24, 2024

ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ బైక్‌ల ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ వాహనాలను సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ నారాయణ్‌నాయక్ ప్రారంభించారు. కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రెండు వాహనాలను జాయింట్ సిపి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ వాహనాలు బాలానగర్, జీడిమెట్ల జోన్ పరిధిలో పనిచేస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 18 వానాలు ఉన్నాయని తెలిపారు.

ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు,లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తుంటారని తెలిపారు. రద్దీ సమయంలో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ టీంలు పెట్రోలింగ్ నిర్వహిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, డిసిపిలు యోగేష్ గౌతం, నితికపంత్, ఎడిసిపి శ్రీనివాస్ రెడ్డి, ఎసిపి ట్రాఫిక్ చంద్రశేఖర్, ఎస్‌సిఎస్‌సి జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News