Tuesday, December 3, 2024

వెంచర్లలో దొంగతనాలు.. 11 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Cyberabad police arrested 11 robbers

రంగారెడ్డి: శంకర్ పల్లి, ఆర్సీపురంలో కన్ స్ట్రక్షన్ మెటీరియల్ దొంగిలిస్తున్న 11 మంది అంతర్ రాష్ట్ర ముఠా బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు కన్ స్ట్రక్షన్ మెటీరియల్ కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 55 లక్షల విలువ చేసే మెటీరియల్, రూ 9.50లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కన్ స్ట్రక్షన్ సైట్లలో సెక్యూరిటీ గార్డులను బెదిరించి దొంగతనాలకు పాల్పడ్డారని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. దొంగతనం చేసిన మెటీరియల్ కొనుగోలు చేస్తున్న మనీష్ ఎలక్ట్రికల్ షాపు యాజమాని, ఓ స్ర్కాప్ ఏజెన్సీకి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు సిపి వెల్లడించారు. ఈ కేసులో రాజస్థాన్ కు చెందిన ప్రదీప్ కుష్వాల్ ప్రధాన నిందితుడిగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు. వెంచర్లలో పగలు రెక్కీ నిర్వహించి రాత్రి పూట చోరీలు చేసేవారని సజ్జనార్ తెలిపారు.

Cyberabad police arrested 11 robbers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News