Sunday, January 19, 2025

డ్రగ్స్ పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేసి డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. ఎస్‌ఓటి పోలీసులు తనిఖీల్లో 4.4 కేజీల గంజాయి, ఎల్‌ఎస్‌డీ పేపర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేసిన సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు డ్రగ్స్, గంజాయిని సీజ్ చేశారు. అల్లాపూర్‌లో 1.9 కేజీల గంజాయిని , బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ను పట్టుకున్నారు. అత్తాపూర్‌లోని డీమార్ట్ వద్ద ఆటోలో పెట్టుకొని గంజాయి అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి 2010 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. నాలుగు కేసుల్లో ఐదు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News