Thursday, January 16, 2025

పబ్బులు, ఫామ్‌హౌజ్‌లపై దాడులు.. ఏడుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్బులు, ఫామ్‌హౌజ్‌లపై సైబరాబాద్ పోలీసులు శనివారం దాడులు చేశారు. వీటిల్లో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 16 పబ్బుల్లో ఎస్‌ఓటి పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ జోన్‌లోని రెండు పబ్బులు నిబంధనలు ఉల్లంఘిస్తుండడంతో కేసు నమోదు చేశారు. హర్ట్ కప్ పబ్బు యజమాని పవన్‌కుమార్, మేనేజర్ ఆదిత్య తమాంగ్‌పై కేసు నమోదు చేశారు. బిర్డ్ బాక్స్ పబ్బు మేనేజర్ అర్జున్, యజమాని వంశీ వర్దన్‌పై కేసులు నమోదు చేశారు. ఈ పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తుండడంతో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫామ్‌హౌజ్‌లపై దాడులు…
మొయినాబాద్ పరిసరాల్లోని 33 ఫామ్‌హౌజ్‌లపై దాడలు నిర్వహించారు. ఇందులో నిబంధనలు ఉల్లంఘించిన ఫామ్ హౌజ్‌ల్లో పనిచేస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సెలబ్రిటీ ఫామ్‌హౌజ్, ఎటర్నిటీ ఫామ్‌హౌజ్, ముషీరుద్దిన్ ఫామ్‌హౌజ్‌లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేస్తున్నారు. వాచ్‌మెన్ సుధాకర్, యజమాని ప్రశాంత్, ఎటర్నిటీ ఫామ్‌హౌజ్‌లో వాచ్‌మెన్ పటేపై కేసు నమోదు చేశారుల్ రాజు పోగుల, నరేష్‌కుమార్, ముషీరుదిదన్ ఫామ్‌హౌజ్‌లో వాచ్‌మెన్ స్వామి, యజమాని ముషీరుద్దిన్‌పై కేసు నమోదు చేశారు. ఇందులో ముగ్గురు వాచ్‌మెన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఫామ్‌హౌజ్‌ల నుంచి మద్యం బాటిళ్లు, బీర్లు స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News