Monday, December 23, 2024

సైబరాబాద్‌లో ఆపరేషన్ స్మైల్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: బడికి వెళ్లాల్సి పిల్లలు వివిధ పనులు చేస్తుండడంతో వారిని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆపరేషన్ స్మైల్ టీములు కాపాడాయి. వారిలో స్థానిక పిల్లలు 360 మంది ఉండగా, మిగతా రాష్ట్రాలకు చెం దిన వారు 389 మంది ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న టీములు జనవరిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో బాల కార్మికులుగా పనులు చేస్తున్న పిల్లలకు వివముక్తి కల్పించారు. ఇందులో వేరే రాష్ట్రానికి చెందిన బాలురు 360 మంది, బాలికలు 29 మంది ఉండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలురు 301, బాలికలు 28 మంది ఉన్నారు. సైబరాబాద్ పోలీసులు కాపాడిన వారిలో భిక్షాటన చేస్తున్న 40 మంది, రాగ్ పికింగ్ 37 మంది, బాల కార్మికులు 640 మంది ఉన్నారు.

అంతర్రాష్ట్ర పిల్లల్లో బాలురు 360 మంది, బాలికలు 29మంది ఉన్నారు. పట్టుబడిన పిల్లల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలురు 301మందిని, బాలికలు 28 మందిని షెల్టర్ హోంకు తరలించారు. మిగతా రాష్ట్రాలకు చెందిన 182 మంది బాలురు, 10 మంది బాలికలను షెల్టర్ హోంలో చేర్చారు. బాలురు 479మంది, బాలికలు 47 మందిని వారిని తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పగించారు.
640 మంది బాల కార్మికులు…
ఆపరేషన్ స్మైల్‌లో పట్టుబడిన వారిలో 640 మంది పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇందులో ఒక మిస్సింగ్ కేసు ఉంది. ర్యాగ్‌పికింగ్ చేస్తున్న వారిలో 37 మందిని పట్టుకున్నారు. బెగ్గింగ్ చేస్తున్న 40మంది పిల్లలను కాపాడారు. 360 మంది బాలురు, 29 మంది బాలికలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News