Sunday, December 22, 2024

హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బులు సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాాద్: కారులో తరలిస్తున్న హవాలా డబ్బులను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. పెద్ద ఎత్తున హవాలా డబ్బులు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇన్నోవా క్రిస్టా కారును ఆపి తనిఖీ చేయగా అందులో రూ.50లక్షల నగదు లభించింది.

డబ్బులకు సంబంధించిన వివరాలు అడుగగా వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపించలేదు. దీంతో నగదును తరలిస్తున్న విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.50లక్షలను సీజ్ చేశారు. డబ్బులను హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News